నవరత్నాల్లో బాగంగా వున్న పధకాలలో ఒకటైన వై.ఎస్.ఆర్. చేయూత పధకం రెండవ విడత క్రింద జిల్లా కు చెందిన 1,51,344 మంది మహిళలకు రూ. 283.77 కోట్లు లబ్ది చేకూరింది. మంగళ వారం వెలగపూడి నుండి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లో జమ చేసారు. జిల్లాకు మొదటి విడత లో గత ఆగష్టు లో 1,56,035 మందికి 292.55 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. 45 నుండి 60 ఏళ్ళ మద్ద్య వయసు గల ఎస్.సి., బి.సి. స్.టి. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు చిరు వ్యాపారాలు చేసుకొనుటకు సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున నాలుగేళ్ళలో 75,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించడం జరుగుతోంది. జిల్లాలో మొదటి విడత క్రింద అందజేసిన మహిళా లబ్ది దారులు కిరాణా, డైరీ వ్యాపారాలు చేస్తూ ఆర్ధిక స్వావలంబన సాధిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మెగా చెక్కును లబ్ది దారులకు అందించారు. ఈ కార్యక్రయంలో జిల్లా నుంచి సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య,, కడుబండి శ్రీనివాస రావు, రాజన్న దొర , విజయనగరం కార్పోరేటర్ కోలగట్ల శ్రావణి సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, డి.ఆర్.డి.ఎ, మెప్మా పి.డి లు సుబ్బా రావు, సుధాకర రావు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.