మళాభివ్రుద్ధికి ప్రభుత్వం పెద్దపీట..
Ens Balu
0
Vizianagaram
2021-06-22 12:35:36
మహిళలకు చేయుత ద్వారా సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో 75,000 రూపాయల ఆర్ధిక సహాయం చేస్తూ వారి కాళ్ళ మీద వారు బ్రతికేలా చేసి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన ముఖ్యమంత్రి పాలిట మహిళలంతా కృతజ్ఞతా పూర్వకంగా ఉన్నారని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర అన్నారు. మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడారు. ఎంత ఆర్ధిక భారం పడినా ఇచ్చిన మాట ప్రకారంగా అక్క చెల్లెళ్ళ కు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. మహిళలు కిరాణా, డైరీ వంటి చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంభం లో గౌరవాన్ని పొందేలా చేసిన ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటామనే భావన వ్యక్తం చేస్తున్నారన్నారు. అర్హత కలిగి లబ్ది పొందని మహిళలు దరఖాస్తు చేసుకోవాలని, ఎంత మందికైన అర్హులకు ఆర్ధిక సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రయంలో జిల్లా నుంచి సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య,, కడుబండి శ్రీనివాస రావు, రాజన్న దొర , విజయనగరం కార్పోరేటర్ కోలగట్ల శ్రావణి సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, డి.ఆర్.డి.ఎ, మెప్మా పి.డి లు సుబ్బా రావు, సుధాకర రావు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.