కరోనా నుంచి రక్షణగా ఆనందయ్య మందు..


Ens Balu
0
విశాఖ సిటీ
2021-06-22 12:55:39

కరోనా సమయంలో ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు ఆనందయ్య మందును వేసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చునని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అన్నారు. మంగళవారం రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి జివిఎంసి కి అందజేసిన మందును ఆయన అల్లిపురం పి.హెచ్.సి. సెంటర్లో ఫ్రంట్ లైన్ వారియర్సుకు ఆనందయ్య మందును అందించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మొత్తం 1275 డబ్బాల మందుని అందించినందుకు రాజ్యసభ సభ్యులు  వి. విజయసాయి రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీటిని అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోను, ఎఫ్.అర.యు. సెంటర్లో ఉన్న ఎ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, సిబ్బందికి అందించమన్నారు. ఒక డబ్బా మందును 5 మందికి చింత గింజంత పరిమాణంలో ఉదయం ఒక్కటి, సాయంత్రం ఒకటి చొప్పున ఒక్క రోజు మాత్రమే అన్ని వయసులు వారు వాడవచ్చన్నారు. ఈ మందు సేవించినచో మాంసం, మద్యం, ధూమపానం చేయరాదని, గర్భిణీలు, బహిష్ట సమయంలో వాడరాదని, ఏ ఇతర మందులు వాడుతుంటే వాటిని యధావిధంగా వాడుకోవచ్చని, మందు తిన్న రోజు 5 నుండి 6 లీటర్లు నీరు త్రాగాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నవారు కూడా ఈ మందును తీసుకోవచ్చని అదనపు కమిషనర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ శశిభూషణ్, జోనల్ మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.