జిల్లాలో 1,99,370 మందికి చేయూత..


Ens Balu
3
Anantapur
2021-06-22 13:11:01

వైఎస్సార్ చేయూత రెండవ విడత ద్వారా జిల్లాలో 1,99,370 మందికి లబ్ది చేకూరింది. ఒకొక్కరికి రూ.18,750 చొప్పున మొత్తం రూ.373.82 కోట్లు జిల్లాకు దక్కాయి. వీటిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.70.05 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.16.81 కోట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.241.54 కోట్లు, ముస్లిం మైనారిటీలకు రూ.45.09 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీలకు రూ 0.33 కోట్లు దక్కాయి.  డీఆర్డీఏ ద్వారా 1,55,172 మంది గ్రామీణ మహిళలు రూ.290.95 కోట్లు, మెప్మా ద్వారా 44,198 మంది పట్టణ ప్రాంత మహిళలు రూ. 82.87 కోట్లు పొందారు. ఎవరైనా అర్హుల పేర్లు వైఎస్సార్ చేయూత రెండవ విడత జాబితాలో లేనట్టయితే లబ్ధిదారుల గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.  వీడియో కాన్ఫరెన్సులో అనంతపురం కలెక్టరేట్ నుంచి ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకట్రామి రెడ్డి, దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, మెప్మా పీడీ రమణా రెడ్డి మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.