యోగా విజేతలకు కలెక్టర్ అభినందన..


Ens Balu
4
Visakhapatnam
2021-06-22 13:23:41

రాష్ట్ర స్థాయి ఆయుష్ యోగా పోటీలలోవిజేతలకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మంగళవారం తన కార్యాలయంలో అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా 18 సంవత్సరముల లోపు పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్చువల్ యోగా పోటీలలో ప్రథమ బహుమతి పొందిన ఎలమంచిలి జిల్లా పరిషత్ హైస్కూలులో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి జి.లయవర్ధన్, కన్సోలేషన్ బహుమతి పొందిన చోడవరం రవి కాన్వెంట్ లో ఆరవ తరగతి విద్యార్థిని పి.వెన్నెలశ్రీ లకు మంగళవారం తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, ఆయుష్ శాఖ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ వెంకటరావు, డాక్టర్ హరికృష్ణ, యోగా గురువులు సతీష్, కిరణ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.