భారతదేశం ఓ రాజనీతిజ్ఞుడుని కోల్పోయింది..ఏఐఎన్ఈఎఫ్


Ens Balu
2
Machilipatnam
2020-09-01 14:00:04

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ పాత్రికేయుడు భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (AINEF) ప్రగాఢ సంతాపం తెలయజేసింది. ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్.పూర్ణచంద్ర రావు నేడిక్కడ  ఒక ప్రకటన లో.. ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజకీయ విలువులున్న నేత అని,అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఎదురైన సమస్యల ను పరిష్కరించి ట్రబుల్ షూటర్ గా ప్రసిద్ధి  గాంచారన్నారు.  ప్రణబ్ దాదాగా జర్నలిస్ట్ కూడా అయి నందున జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేవారన్నారు. జర్నలిస్టులను గౌరవించడం బాగా తెలిసిన గొప్ప నీతిజ్ఞుడని పూర్ణచంద్ర రావు ప్రస్తుతించారు. ఒక ఆర్థిక వేత్త,రాజనీతిజ్ఞుడు,జర్నలిస్టుని బారతదేశం కోల్పోయిందన్న ఆయన దాదా ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు దేవుడు మనో దైర్యాన్ని ప్రశాదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సిఫార్సు