తూ.గో.జిల్లాకి రూ. రూ.423.35 కోట్లు లబ్ది..


Ens Balu
1
Kakinada
2021-06-22 14:34:00

తూర్పుగోదావ‌రి జిల్లాలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు చెందిన 45-60 ఏళ్ల మ‌ధ్య‌గ‌ల 2,25,789 మంది మ‌హిళ‌లు వైఎస్సార్ చేయూత ప‌థ‌కం ద్వారా రూ.423.35 కోట్ల మేర ల‌బ్ధిపొందుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. వైఎస్సార్ చేయూత ప‌థ‌కం ద్వారా రెండో ఏడాది మ‌హిళ‌ల ఖాతాల్లో దాదాపు రూ.4,339 కోట్ల‌ను బ‌ట‌న్ నొక్కి నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ‌లోని క‌లెక్ట‌రేట్ వివేకానంద హాల్ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత‌, ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, వివిధ ప్రాంతాల‌కు చెందిన ల‌బ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ అర్హులైన 45-60 ఏళ్ల మ‌ధ్య‌గ‌ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున ప్ర‌భుత్వం అందిస్తోంద‌ని తెలిపారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌థ‌కం కింద 60,858 మంది ఎస్సీ ల‌బ్ధిదారుల‌కు, 12,129 మంది ఎస్టీ ల‌బ్ధిదారుల‌కు, 1,49,095 మంది బీసీ ల‌బ్ధిదారుల‌కు, 3,707 మంది మైనారిటీ ల‌బ్ధిదారుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతోంద‌ని వివ‌రించారు. మ‌హిళ‌ల ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క వైఎస్సార్ చేయూత ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని లబ్ధిదారుల‌కు సూచించారు. ఆస‌క్తి ఉన్న‌వారు కిరాణాషాపులు ఏర్పాటుచేసుకునేందుకు అదే విధంగా గేదెలు, ఆవులు, మేక‌లు వంటి యూనిట్లను పంపిణీ చేసి కుటుంబాల ఆర్థిక ప్ర‌గ‌తికి బాట‌లు వేసేందుకు ప్ర‌భుత్వం తోడ్పాటునందిస్తోంద‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌ల వ్యాపార అభివృద్ధికి సాయ‌ప‌డేందుకు వీలుగా అముల్‌, రిల‌యెన్స్‌, పీ అండ్ జీ త‌దిత‌ర పెద్ద సంస్థ‌ల‌తో ప్ర‌భుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, బీసీ, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీలు ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మి, జీఎస్ సునీత,  మైనారిటీ సంక్షేమ అధికారి పీఎస్ ప్ర‌భాక‌ర‌రావు, వివిధ ప్రాంతాల‌కు చెందిన ల‌బ్ధిదారులు పాల్గొన్నారు.