అనంత ఆక్రమణలపై కఠిన చర్యలు..


Ens Balu
3
Anantapur
2021-06-22 14:37:03

అనంతపురం నగర పరిధిలో ఆక్రమణలు తొలగించుకోకుంటే మేమే చర్యలు తీసుకుం టామని నగర మేయర్ మహమ్మద్ వసీం హెచ్చరించారు. నగరంలోని సాయి నగర్ 1,2,3 ,4 వ క్రాస్ ల పరిధిలో రోడ్ ఆక్రమించి భవనాల మెట్లు,పార్కింగ్ ,హొర్డింగ్ లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు  ఎదుర్కొంటున్నారని మేయర్ వసీం దృష్టికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన మేయర్ వసీం మంగళశారం సాయంత్రం సాయి నగర్ పరిధిలో అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా అనేక మంది భవనాల యజమానులు రోడ్ ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తుడంతో వారితో మేయర్ మాట్లాడుతూ, మీ ఆక్రమణలు మూలంగా ప్రజలు ఇబ్బందులు పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిర్ధిష్ట గడువులోగా వాటిని తొలగించుకోకుంటే మా సిబ్బంది తొలగిస్తారని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం వీటిపై దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వారం లోపు ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో రోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు బాలాంజినేయులు,సోని రమణ, అనిల్ కుమార్ రెడ్డి, కమల్ భూషణ్,డిప్యూటీ కమిషనర్ రమణా రెడ్డి,ఏసిపి సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.