మాన్సాస్ ఆక్రమాలు ఆ విధంగా తెరపైకి ..
Ens Balu
2
Visakhapatnam
2021-06-23 02:49:42
విజయనగర రాజ వంశంలో కీలకంగా వున్న మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇపుడు మాన్సాస్ లో జరిగిన అక్రమాలు బయటకు తీస్తారా..వాటిలో ఎవరి హస్తం ఉందో ఆకోణంలో వాస్తవాలు బయటకొస్తాయని చెబుతున్నారు. దానికి విశాఖలో రాజ్యసభ్య సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేసిన ఆశక్తికర వ్యాఖ్యలు బలాన్ని చేకూరస్తున్నాయి. మొన్నటి వరకూ టిడిపి అధికారంలో ఉండటంతో ఆ ట్రస్టుకి చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తూ వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ఆ ట్రస్టు, సింహాచల దేవస్థాన చైర్మన్ పదవులు సంచయిత గజపతిరాజు చేతిలోకి వచ్చాయి.. చాలా ఏళ్ల తరువాత ట్రస్టు చేతులు మారిందని, దాని రూపు రేఖలు మారుతాయనుకున్న తరుణంలో మళ్లీ హైకోర్టులో అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాధి వాదలను వినిపించడంతో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఆ వెంటనే రాజకీయాలకు తెరలేపిన అశోక్ గజపతిరాజు ప్రభుత్వంపై చాలా వ్యాఖ్యలే చేశారు. వాటిని సుమోటాగా స్వీకరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ వచ్చింది. అయితే గత వారం రోజుల నుంచి మాన్సాస్ అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు కాస్త గట్టిగానే ద్రుష్టిపెట్టినట్టు వార్తలొస్తున్నాయి. మాన్సాస్ విషయంలో చేసిన అవినీతిని బయట పెడతామని విజయసాయిరెడ్డి ప్రకటించండంతో ఆ వేడి మరింత రాజుకుంది. ఉత్తరాంధ్రాలోని కీలకమైన అంశంగా మాన్సాస్ వ్యవహారం గజపతిరాజు వంశాన్ని ఓ కుదుపు కుదిపింది. మాన్సాస్ వ్యవహారంలో ఒకే కుటుంబంలో కూతురు, చిన్నాన్నలు కోర్టుకెళ్లి నువ్వా నేనా అని తలపడిన సమయంలో హైకోర్టు చిన్నాన్న వైపే తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకి వెళ్లి పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాజు మాన్సాస్ లో చేసిన అవినీతి ఆధారాలతో సహాయ బయట పెట్టిన తరువాత వాటితో సుప్రీం కోర్టుకి వెళ్లాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ట్రస్టు భూములు పక్కదారిపట్టాయని వాటి పరిరక్షిస్తామని చెప్పడంతో ఈ విషయంలో గట్టిగానే సమాధానం చెబుతామన్నా మంత్రులు ప్రకటనలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ విషయంలో ప్రభుత్వాని వ్యతిరేకంగా వున్న మీడియా దీనినే ప్రధాన అంశంగా కూడా చూపిస్తూ ప్రజలను ఆలోచింపచేస్తున్నా..వాస్తవ అక్రమాలను బయటకు తీసినపుడు అదే స్థాయి ప్రచారం కల్పించి రాజు అవినీతి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో మాన్సాస్ మరో మలుపు తిరిగి ప్రభుత్వానికి తలనొప్పిగా మారినా..వాస్తవాలను ప్రజలకు తెలియజేసి మళ్లీ సంచయిత గజపతిరాజుని ట్రస్టుకి చైర్మన్ ను చేయాలనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అంశం. అందుకే నేటికి కూడా గజపతిరాజు సంచయిత కోర్టు తీర్పు విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడటం, గజపతిరాజు, టిడిపి నేతల ఆరోపణలపై స్పందిస్తున్నారు తప్పితే సంచయిత మాత్రం నోరు విప్పడం లేదు. అటు ఈ విషయంలో విజయనగర రాజులకు ప్రతిష్టాత్మకంగా వున్న మాన్సాస్ ట్రస్టు విషయంలో కుటుంబ పరువు తీసుకోవద్ద చిన్నాన్న, కుటుంబ సభ్యులు సంచయితపై ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు మాన్సాస్ లోని ముఖ్యమైన వ్యవహారాలు చేధించినట్టుగానే కనిపిస్తుంది. ఆ కారణంతోనే వాస్తవాలతోనే ప్రజలముందుకి వస్తామనే మాటలకు బలం చేకూరుతుంది. చాలా ఏళ్ల నుంచి మాన్సాస్ ట్రస్టును టిడిపి నాయకులు మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహిస్తూ వస్తున్నారు. అదేసమయంలో సింహాచలం ట్రస్టుబోర్టులో కూడా ఈ కుటుంబం నుంచే అనువంశికంగా ధర్మకర్తలు కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా తెరపైకి వచ్చిన సంచయిత గజపతిరాజుని ప్రభుత్వం ప్రమోట్ చేయడం..ప్రత్యేక జీఓల అధికారం చేతిలో పెట్టినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మాన్సాస్ లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం కూడా చాలా గట్టి పట్టే పట్టింది. ఈ రసవత్తర సమయంలో మాన్సాస్ విషయంలో సంచయిత గజపతిరాజుకి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా తిరిగి మళ్లీ మాన్సాస్ కి మహారాణి అవుతుందా..ఏ స్థాయిలో రాష్ట్రప్రభుత్వం మాన్సాస్ లో జరిగిన అవినీతిని బయటకు తీసి అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచుతుంది అనేది ఆశక్తికరంగా మారింది..!