25న అరసవెల్లిలో హుండీ లెక్కింపు..
Ens Balu
2
Arasavilli
2021-06-23 12:38:38
శ్రీకాకుళం జిల్లాలోని ఈ నెల 25న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలు లెక్కింపు ఉంటుందని దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమీషనర్, కార్య నిర్వహణాధికారి వి. హరి సూర్య ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీన (శుక్రవారం) ఉదయం 9 గంటలకు 40 మంది సిబ్బందితో డిపార్టమెంటు వారి సమక్షములో అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం హుండీలు తెరచుటకు నిర్ణయించడమైనదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.