సత్వరమే ప్రభుత్వ నిర్మాణాలు జరగాలి..


Ens Balu
3
Vemuru
2021-06-23 14:17:47

ప్రభుత్వ నిర్మాణాలను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వేమూరు మండలం, జంపని గ్రామంలో  ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంతో పాటు జనగన్న కాలనీ నిర్మాణాలను అధికారులతో కలసి పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన బిల్లులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఎస్.ఈ నతానియేల్, తెనాలి ఇన్ చార్జ్ ఆర్ డి ఓ భాస్కర రెడ్డి, తెనాలి డివిజన్ మండలాల తహశీల్దార్లు, యంపిడిఓ లు, విద్యుత్, గృహ నిర్మాణ, పంచాయితీ రాజ్, ఏ.పి ఫైబర్ నెట్ శాఖాధికారులు, సచివాలయాల కార్యదర్శులు,  వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.