తిరుపతిలో అన్ లాక్ 4.0 నిబంధలు అమలు...


Ens Balu
3
Tirupati
2020-09-01 14:50:44

కేంద్ర ప్రభుత్వం నిబంధన  అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు పాటిస్తూ, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నేటి నుంచి యదావిధి గా అన్నిషాపులు తెరుచుకోవడా నికి అనుమతిస్తున్నట్టు కమిషనర్ గిరీష చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న మున్సిపల్ పార్కులన్నింటికీ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పని సరిగా ధరించాలని, భౌతిక దూరం పాటిస్తేనే పార్క్ లోకి అనుమ తించేలా ఆదేశాలు జారీచేశామన్నారు. సంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు, శుభకార్యాలకు 100 మందికి లోపల, తిరుపతి అర్బన్ పోలీస్ విభాగం నుంచి అనుమ తులు తీసుకోవచ్చని తెలియజేశారు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన పెద్ద వారు, గర్భిణీలు, 10 సంవత్సరాల లోపు పిల్లలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇంటి వద్దే ఉండాలని కమిషనర్ కోరారు. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించినా తక్షణమే వార్డు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. లేదంటే దగ్గర్లోని పీహెచ్సీకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కమిషనర్ సూచించారు.
సిఫార్సు