బాల శక్తి, బాల కళ్యాణ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం


Ens Balu
4
Visakhapatnam
2020-09-01 14:55:23

జాతీయ స్థాయిలో 2021 సంవత్సరానికి “బాల శక్తి పురస్కార్, బాల కళ్యాణ్ పురస్కార్” అవార్డులు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ పీడి ఎన్.సీతా మహాలక్ష్మి తలెలియజేశారు. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన బాలలకు “బాల శక్తి పురస్కార్” అవార్డు , బాలలపై పనిచేసే స్వచ్చంధ సంస్థలు మరియు వ్యక్తులకు “బాల కళ్యాణ్ పురస్కార్” అవార్డు ఇస్తారన్నారు.  జాతీయ స్థాయిలో ఎంపికైన బాలలకు, స్వచ్చంధ సంస్థలకు జనవరి 26, 2021 సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలలో  రాష్ట్రపతి ,  ప్రధానమంత్రి ఈ అవార్డు అంతజేస్తారన్నారు. దీనితోపాటు పాటు నగదు ప్రోత్సాహకం అందజేస్తారని చెప్పారు. ఆశక్తి వున్నవారు  సెప్టెంబరు 15వ తేదిలోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం  www.nca-wcd.nic.in  వెబ్ సైట్ లో సంప్రదించాలని కోరారు. 
సిఫార్సు