విశాఖపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం సిఎస్ ఆర్ క్రింద రూ.23 లక్షల విలువైన పి.పి.ఇ కిట్లు, సర్జికల్ మాస్కులను డిఎంహెచ్ఓ కు అందజేసినట్టు బ్యాంకు మాడ్యుల్ డిజిఎం కె.రంగరాజన్ తెలిపారు. గురువారం ఈ మేరకు యస్.బి.ఐ ఫౌండేషన్ కార్పొరేట్ సెంటర్, ముంబయి సహకారంతో 1500 పి.పి.ఇ కిట్లు, సర్జికల్ మాస్క్‌లను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పంపిణీచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పి.పి.ఇ కిట్లు సర్జికల్ మాస్క్‌లను ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలో యస్.బి.ఐ ఎపుడూ ముందుంటుందని, ప్రతీ ఏడాది వివిధ సామాజిక కార్యక్రమాలను చేపడుతుందని ఆయన గుర్తుచేశారు. గతేడాది కరోనా సంక్షోభ సమయంలో సామాజిక బాధ్యత క్రింద వెంటిలేటర్లను పంపిణీచేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో యస్.బి.ఐ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.