దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి..
Ens Balu
2
Srikakulam
2021-06-24 14:42:00
శ్రీకాకుళంజిల్లాలోని మహిళలంతా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు కారోరు. కోవిడ్ పరిస్థితులు, దిశ యాప్ డౌన్లోడ్ తదితర అంశాలపై అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఆపద సమయంలో దిశ యాప్ మహిళలకు రక్షణ కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ యాప్ తీసుకు వచ్చిందని ఆయన చెప్పారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి డౌన్ లోడ్ చేయించాలని ఆయన ఆదేశించారు. యాప్ ఉపయోగాలు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మండల అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వాటిని విస్తృతస్థాయిలో నిర్వహించాలని ఆయన చెప్పారు. కోవిడ్ వ్యాప్తి కాకుండా చేపట్టాల్సిన చర్యలు, మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవడం వంటి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన మరింతగా పెంపొందించాలని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని రెండవ డోసు పెండింగ్ ఉన్నవారు, ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లల తల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పాజటివ్ కేసులు గుర్తించుటకు నమూనాలను సేకరించాలని ఆయన ఆదేశిస్తూ నరసన్నపేట, వీరఘట్టం, భామిని తదితర మండలాల్లో పది కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఎక్కువ కేసులు నమోదు అవుతున్న మండలాలు, ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో నమూనాలు సేకరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కోవిడ్ లక్షణాలు లేని కేసులు ఎక్కువగా ఉంటున్నాయని తదనుగుణంగా నమూనాలు సేకరించాలని ఆయన అన్నారు. ట్రయేజింగ్, హోమ్ ఐసోలేషన్, మెడికల్ కిట్లు అందజేతపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.