మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దిశ యాప్ ద్వారా అరికట్టేందుకు మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్టు సంయుక్త కలెక్టర్( సచివాలయాలు, అభివృద్ధి) పి. ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళల పై అత్యాచారాలను నిరోధించడాన్ని దృష్టిలో పెట్టుకుని దిశ చట్టంను తీసుకొచ్చారన్నారు తెలిపారు. ఈ దిశ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి ఈ దిశ యాప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు ఇబ్బందులు ఎదురైతే దిశ యాప్ ను ఉపయోగించి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఇటీవల తాడేపల్లి, సీతానగరంలో జరిగిన అఘాయిత్యం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గురువారం వాలంటీర్లు, సంబంధిత సచివాలయం మహిళా పోలీసు బృందంగా కలసి నూజెండ్ల మండలం ఉప్పలపాడు, కంభంపాడు, మాచర్ల మునిసిపాలిటీ, గురజాల మండలం చర్లగుడిపాడు, మాడుగుల, పులిపాడు, దాచేపల్లి మండలం పొందుగల, రామాపురం, తెనాలి పట్టణంలో ఇంటింటికి వెళ్ళి దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం, దానిని ఉపయోగించడంపై అవగాహన కల్పించినట్లు సంయుక్త కలెక్టర్ వివరించారు.