విశాఖలో ఈ నెల 26వ తేదీన భారత ఉప రాష్ట్రపతి బి. వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా, ఆయన విడిది చేసే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని జివిఎంసి అదనపు కమిషనర్, లైజింగ్ ఆఫీసర్ డా. బి. సన్యాసిరావు శానిటరి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నాలుగవ జోన్ 28వ వార్డులో ఉన్న పోర్టు గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన భారత ఉప రాష్ట్రపతి విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఆయన విడిది చేసే పోర్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని రోడ్లు, కాలువలును శుభ్రం చేయాలని, ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్ జల్లించి, ఫాగింగ్ చేయాలని, ఆయా ప్రాంతాలలో ఆవులు, గేదెలు, కుక్కలు, పందులను సంచరించకుండా చూడాలని శానిటరి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.