సింహాద్రినాథునికి రూ.1,01,116 విరాళం..


Ens Balu
3
Simhachalam
2021-06-24 16:49:51

విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన మాజీ సైనిక ఉద్యోగి సింగంశెట్టి కృష్ణారావు సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 (లక్షా వెయ్యినూటపదహారు) విరాళంగా అందించారు. ఆ చెక్కును గురువారం ఈ మేరకు పీఆర్వో ఆఫీసులోని కౌంటర్ లో క్యాష్ అందించారు. ఈ సందర్బంగా దాత మాట్లాడుతూ, తమ పెళ్లిరోజు 20-06-2022న భక్తులకు అన్నదానం చేయాలని దేవస్థాన నిర్వాహకులను కోరినట్టు చెప్పానన్నారు. తాను ఉద్యోగం నుంచి రిటైరవ్వడం వల్ల కొంత మొత్తం అందిందని అందులో కొంత స్వామికి సమర్పించానని చెప్పారు. స్వామివారి కృపవల్లే తాను ఆయురారోగ్యాలతో సుఖంగా జీవిస్తున్నానని,  అందుకే విరాళమిచ్చినట్లు కృష్ణారావు తెలిపారు. అనంతరం దాతకు రిసిప్టుతోపాటు అన్నదానం బాండ్ అందించారు ఆలయ సిబ్బంది. అంతకుముందు స్వామిని దర్శించుకొని తీర్ధ  ప్రసాదాన్ని స్వీకరించారు.