ఎస్ఐ ఉద్యోగానికి సార్ధకత తీసుకువాలి..
Ens Balu
2
Siddipet
2021-06-25 13:55:20
ఎన్నో పరీక్షలు కష్టపడి నెగ్గి సాధించిన ఎస్ ఐ ఉద్యోగానికి సార్థకత తీసుకొని రావాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ప్రొబిషనరీ ఎస్ఐలకు హిత బోద చేశారు. ఐదు నెలల శిక్షణ నిమిత్తం సిద్దిపేట కమిషనరేట్ కు వచ్చిన 26 మంది ప్రొబిషనరీ ఎస్ఐలతో చట్ట ప్రకారం నేర్చుకోవాల్సిన విధివిధానాలపై ఎస్ఐలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుత శిక్షణా కాలంలోనే పోలీసు స్టేషన్లలోని విధుల పట్ల పూర్తి అవగాహన కల్పించుకోవాలన్నారు. ఎస్ఐ స్థాయి అధికారులు ప్రజలతో మమేకమై విధులు నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావించాలన్నారు. సిబ్బందితో కలసి విధులు నిర్వహింహించడం ద్వారా అన్ని విషయాలపట్ల మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు వారి సమస్యను సామరస్యపూర్వకంగా విని ఏ విధంగా పరిష్కరించాలో పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజం ప్రజలు పోలీసు చేసే ప్రతి పనిని పరిశీలిస్తోందని అది గమనిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. చట్టప్రకారం విధులు నిర్వహించి డిపార్ట్మెంట్ , వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడాలని పేద ప్రజలు పోలీస్ స్టేషన్కు వచ్చినపు వారికి మీ ద్వారా సహాయం అందుతుందనే భరోసా కల్పించాలన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకు సాగాలన్నారు. సమాజం, ప్రజలు మెచ్చుకునే విధంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు పోలీస్ డిపార్ట్ మెంట్ పై నమ్మకం పెరుగుతందన్నారు.