ఎయిర్ పోర్టు పనులు వేగం పెంచాలి..


Ens Balu
7
Bhogapuram
2021-06-25 14:03:37

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ , రాయిపూర్–విశాఖ జాతీయ రహదారి కి సంబంధించి పెండింగ్  పనులు వేగంగా జరగాలని  సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ ఆదేశించారు.  శుక్రవారం ఆయన ఛాంబర్ లో భూ సేకరణ తదితర పనుల పై జే.సి  సమీక్షించారు.  భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం  కోర్ట్ కేసు లలో ఉన్న 89.47 ఎకరాల  భూమి  కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, అందుకు సంబంధించి  ఎ.రావి వలస, సవరవల్లి, రావాడ, గుడెపు వలస గ్రామాలలో  అటవీ క్లియరెన్స్ , ఉద్యాన పంటల లెక్కింపు త్వరిత గతిన పూర్తి చెయ్యాలణి  ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.  కోర్ట్  కేసు ల పరిష్కారం, గజెట్ పబ్లికేషన్ తదితర పనులను వేగంగా జరిగేలా చూడాలని రెవిన్యూ దడివిజినల్ అధికారి భవానీ శంకర్ కు సూచించారు.  ఎయిర్ పోర్ట్ అథారిటీ, జాతీయ రహదారి ప్రాజెక్ట్ అధికారి తో  ఉప కలెక్టర్లు  మాట్లాడుకొని రీ కన్సిలేషన్ పనులు కూడా సత్వరమే పూర్తయ్యేలా చూడాలన్నారు.  జాతీయ రహదారి కి సంబంధించి ఉప కలెక్టర్ లు ప్రతి రోజు క్షేత్ర స్థాయి లో పర్యటించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించి పనులను ముందుకు వెళ్ళేలా చూడాలన్నారు.  భూ సేకరణ పూర్తి చేసి  అవార్డులను పాస్ చెయ్యాలని ,  అధికారులంత సమన్వయంతో పని చెయ్యాలని అన్నారు. ఈ సమావేశం లో ఉప కలెక్టర్లు హెచ్. జయరాం, పద్మావతి,   వెంకటేశ్వర రావు,  తహసిల్దార్ ,  ఉద్యాన, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.