బ్లాక్ ఫంగ‌స్‌పై ఆందోళ‌న వ‌ద్దు..


Ens Balu
2
Kakinada
2021-06-25 15:00:22

బ్లాక్ ఫంగస్ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు.  ప్ర‌స్తుతం జిల్లాలో ఆరు ప్ర‌భుత్వ‌, 35 ప్రైవేటు మొత్తం 41 ఆసుప‌త్రులు కోవిడ్ వైద్య సేవ‌లందిస్తున్నాయ‌ని, వీటిలో 3,299 ప‌డ‌క‌లు ఉండ‌గా, 78 శాతం ఖాళీగా ఉన్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. బొమ్మూరు, బోడ‌స‌కుర్రు కోవిడ్ కేర్ కేంద్రాల్లో 5000 వ‌ర‌కు ప‌డ‌క‌లు ఉన్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో 280 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోదుకాగా.. ప్ర‌స్తుతం 122 మంది చికిత్స పొందుతున్నార‌ని, రాష్ట్రంలోనే కాకినాడ జీజీహెచ్ బ్లాక్ ఫంగ‌స్‌కు అత్యుత్త‌మ చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. కోవిడ్‌తో త‌ల్లిదండ్రుల‌ను పోగొట్టుకొని అనాథలైన చిన్నారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌లు డిపాజిట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. 

సిఫార్సు