జిల్లాల్లో ఇసుక కొరత రాకుండా చూడాలి..
Ens Balu
3
Anantapur
2021-06-25 16:13:27
వర్షా కాలంలో ఇసుక కొరత లేకుండా ఎక్కువ ఇసుక నిల్వలను సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ లతో ఇసుక సరఫరా, నిల్వలపై రాష్ట్ర పంచాయతీరాజ్, ఇండస్ట్రీస్ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ వర్షా కాలం వచ్చే ముందే ఎక్కువ ఇసుకను జగనన్న ఇండ్ల స్థలాల లేఔట్ లకు సరఫరా చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో ఇసుక సరఫరా కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. ఇసుక రీచ్ నుండి వెంటనే వినియోగదారునికి ఇసుక సరఫరా కావాలన్నారు. ఇసుక రీచ్ లలో రోజు వారి ఇసుక ప్రొడక్షన్ మరియు డిపో ల దగ్గర ఉంచిన ఇసుక వివరములను జిల్లా యంత్రాంగంకు ఏజెన్సీ వారు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, అనంతపురం, కదిరి, రాయదుర్గం మరియు గుంతకల్ యందు కొత్త ఇసుక నిల్వ డిపో లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా రొద్దం, పరిగి, రాయదుర్గం, యల్లనూర్ మరియు తాడిపత్రి మండలాలలో 10 ఇసుక రీచ్ లకు పర్యావరణ శాఖ నుండి మాన్యువల్ త్రవ్వకాల నిమిత్తం ఈసి ఆర్డర్స్ వచ్చాయని, యంత్రంతో పని చేసేందుకు పర్యావరణ శాఖ వారికి ఈసి ఆర్డర్స్ మార్పు కోసం అనుమతి నిమిత్తం దరఖాస్తు చేశామని, పర్యావరణ శాఖ నుండి అనుమతులు రాగానే ఆ ప్రాంతంలలో ఏజెన్సీ వారికి ఇసుక త్రవ్వకాలకు అప్పజెప్పడం చేస్తామన్నారు. ఏజెన్సీ వారిని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా పర్మిట్ లను వినియోగదారునికి జారీ చేయాలన్నారు. తృతీయ శ్రేణి వాగుల ద్వారా గవర్నమెంట్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేసే పనులకు ఇసుక అనుమతి ఇవ్వవాల్సిందగా కోరారు. ఈ విషయమై ప్రిన్సిపల్ సెక్రెటరీ తృతీయ శ్రేణి వాగులలో ఇసుక అనుమతికి సంబందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రజల అవసరాల నిమిత్తం అనంతపురం, కదిరి, రాయదుర్గం మరియు గుంతకల్ ప్రాంతాలలో ఇసుక నిల్వ డిపో లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, మైన్స్ డిడి రమణారావు పలువురు పలువురు మైన్స్ అధికారులు పాల్గొన్నారు.