కోవిడ్19 పై నేటికీ జాగ్రత్తగా ఉండాలి..


Ens Balu
5
Anantapur
2021-06-25 16:16:08

కరోనా19 వ్యాప్తిని పూర్తిగా నిలువరించేందుకు జిల్లా ప్రజలు కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం కరోనా నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నుంచి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ ఖచ్చితంగా  కోవిడ్ నిబంధనలు పాటించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ సమయములో సాయంత్రం 5.45 గంటల లోపు అన్ని దుకాణములు మూసి వేయాలన్నారు. అత్యవసర సేవల కోసం మినహా ప్రజలెవరూ బయటకు తిరగరాదన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలన్నారు. జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఎవరు అలసత్వం చూపించ రాదని, ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు కూడా సాయంత్రం 5.45 గంటల తర్వాత ఇళ్లకు పరిమితమవ్వాలని సూచించారు. పోలీసులు ఆరు గంటల తర్వాత కఠినంగా కర్ఫ్యూ నిబంధనలు అమలు పరచాలని ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్లో డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్,  అడిషనల్ డిఎంహెచ్ఓ  రామ సుబ్బా రావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ పాల్గొన్నారు.