మహిళా సాధికారతే జగనన్న లక్ష్యం..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-25 16:24:04

మహిళా సాధికారతే జగనన్న లక్ష్యమని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శుక్రవారం 4వ జోన్ 29వ వార్డు సచివాలయంలో, ఆ వార్డ్ కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ చేయూత, జగనన్నతోడు పథకంలో భాగంగా రూ.13.10లక్షలు మహిళలకు మేయర్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా  చూసి వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళలు స్వయం శక్తితో ఎదగాలని, వారి అభివృద్ధి కొరకు చిరు వ్యాపారాలు   చేయుటకు,  ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఉద్దేశ్యంతో వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు లాంటి ఎన్నో పథకాలను పెట్టి, వారిని ఆదుకున్నారని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మేయర్ తెలిపారు.