రేపు రెండవ డోసు టీకా మాత్రమే వేస్తారు..
Ens Balu
2
Kakinada
2021-06-25 16:46:38
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో 26వ తేదీన కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండవ డోసు టీకాలు మాత్రమే వేస్తారని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి తెలియజేశారు. శుక్రవారం కాకినాడలో ఏర్పాటు చేసిన కార్యంలో జెసి మాట్లాడారు. కోవీషీల్డ్ మొదటి టీకా వేసుకున్న 84 రోజుల తర్వాత, కోవాగ్జిన్ మొదటి టీకా వేసుకున్న 28 రోజుల తర్వాత రెండవ టీకా వేస్తారన్నారు. రెండవ డోసుకోసం మాత్రమే కేంద్రానికి వెళ్లాలన్నారు. ఈమేరకు అన్ని మండాల్లోని అధికారులు ప్రజలను చైతన్య పరిచి రెండవ డోసు వేయించుకునే చేయాలన్నారు. కోవిడ్ కేసులు అధికంగా వున్నందున మొదటి డోసు టీకా వేయించుకుని రెండవ టీమా సమయం వచ్చిన వారందరికీ టీకా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు.