సింహాద్రి అప్పన్నకు రూ.లక్ష విరాళం..


Ens Balu
4
Simhachalam
2021-06-25 16:53:14

విశాఖ దొండపర్తికి చెందిన విశ్రాంత ఉద్యోలు గన్నవరపు వెంకటరావు, భాగ్యలక్ష్మి దంపతులు శుక్రవరం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి అన్నధాన ట్రస్టుకి లక్ష రూపాయల విరాళంగా అందించారు. ఈ మేరకు దేవస్థానం ఈఈ  శ్రీనివాసరాజుకు పీఆర్వో కార్యాలయంలో చెక్ అంద జేశారు.  ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి కృపతో ఆయురారోగ్యాలతో ఏ లోటూ లేకుండా ఉన్నామని వెంకటరావు, భాగ్యలక్ష్మి దంపతులు తెలిపారు. తమ వివాహ వార్షికోత్సవం 23, ఫిబ్రవరిన భక్తులకు అన్నదానం చేయాలని కోరారు.  అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకొని, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ప్రసాదాలు అందించగా, వేద పండితులు ఆశీర్వచనం ఆశీర్వచనాలు అందజేశారు.