అప్పన్న ఆలయంలో గంట్ల పర్యవేక్షణ..


Ens Balu
2
Simhachalam
2021-06-26 09:17:12

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకోవడానికి శనివారం వేలాది మంది భక్తులు తరలి రావడంతో  సింహగిరి భక్తులు తో కోలాహలంగా మారింది. ఎటు చూసిన భక్త జన సందోహమే కనిపించింది. కొండ దిగువన తొలి పావంచ వద్ద అదే రద్దీ నెలకొంది. గ్రామీణ ప్రాంతాలు నుంచి తరలి వచ్చిన భక్తులు వందలాది కోడి దూడలు స్వామి కి సమర్పించుకొని తమ మొక్కు బడులు చెల్లించుకున్నారు. అప్పన్న ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తొలి పావంచ వద్ద భక్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు స్వామి ని సులభతరముగా దర్శించుకునే అవకాశం కల్పించారు. భక్తులు కి ఇబ్బంది లేకుండా అక్కడ సిబ్బంది తో కలిసి అన్ని సదుపాయాలు కల్పించారు. కోడి దూడల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల రైతులు తో మాట్లాడి వారి మొక్కు బడులు.దర్శనం వంటి అంశాలు పై చర్చించారు. దేవస్థానం అధికారులు పని తీరు శ్రీనుబాబు ప్రసంశించారు.