ఈ దఫా పాత విధానంలోనే ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి..
Ens Balu
2
Visakhapatnam
2021-06-26 09:46:12
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా మంజూరు చేసే ప్రెస్ అక్రిడిటేషన్లు పాత విధానంలోనే ఈ దఫా మంజూరు చేయాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రధాన సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా లో జర్నలిస్టుల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని సమాచారశాఖ మంత్రి పేర్ని నానికి లేఖ రాసినట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం జీఓ లో పేర్కొన్న అంశాలను ఇప్పటికిప్పుడు మీడియా సంస్థలు ఆన్ లైన్ లో దాఖలు చేసే పరిస్థితి లేదన్నారు. అందులోనూ కరోనా సమయంలో మీడియా సంస్థలకు ఎన్నో వ్యవ ప్రయాశలకోర్చి నిర్వహణ చేస్తున్నాయని.. ప్రభుత్వం ఈ దఫా ప్రెస్ అక్రిడిటేషన్లు పాద పద్దతిలోనే మంజూరు చేసి..తరువాత రెవున్యువల్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని కోరారు. లేదంటే ప్రస్తుత నిబంధనల కారణంగా పెద్ద పత్రికలు, టివి ఛానళ్లకు తప్పా మరెవరికీ అక్రిడిటేషన్లు వచ్చే పరిస్థి లేదన్నారు. అదే సమయంలో చాలా వరకూ మీడియా సంస్థలు ప్రెస్ క్లిప్పింగులను సమాచారశాఖ జిల్లా కార్యాలయాల్లో సమర్పించాయని, ఇపుడు వాటిని పీడిఎఫ్ రూపంలోకి మార్చి మళ్లీ ఆన్ లైన్ సమాచారశాఖ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలంటే చిన్న, మధ్య తరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, లోకల్ కేబుల్ టీవీలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కరోనా లో జర్నలిస్టుల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అక్రిడిటేషన్లు మంజూరు చేయాలన్నారు. లేదంటే చిన్న, మధ్యతరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, లోకల్ కేబుల్ టివిలు అక్రిడిటేషన్లను కోల్పోవాల్సి వుంటుందన్నారు. కరోనాలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు అందించిన సేవలను కూడా ప్రభుత్వం గుర్తించాలని ఈఎన్ఎస్ బాలు కోరారు.