పండుగలా మెగా మెళా జరగాలి..


Ens Balu
2
Vizianagaram
2021-06-26 11:57:23

విజయనగరం జిల్లాలోని  గృహ నిర్మాణాల మెగా  మేళా ఒక పండగల జరగాలని విజయనగరం  శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. వార్డ్ వారీగా లబ్ది దారులకు వలాంటిర్ల  ద్వారా  అవగాహన కలిగించాలని అన్నారు. అందుకోసం వార్డ్ వారీగా  బృందాలను  వేయాలని తెలిపారు. ఆప్షన్ 1,2,3 ఇచ్చిన వారి వివరాలను సేకరించాలని అన్నారు. ఆర్.డి.ఓ భవాని శంకర్ మాట్లాడుతూ మండల వారీగా, క్లస్టర్ వారీగా లాయ్ ఔట్ వారీగా ఇన్ఛార్జ్ లను నియమించడం జరిగిందని, ఎవరు ఏ పని చెయ్యాలో  స్పష్టం గా చెప్పడం జరిగిందని అన్నారు.  లే ఔట్ మార్కింగ్, భూమి పూజ చేసి స్థలాన్ని  తదితర పనులను 27 వ తేదీ నుండి 30 వరకు చేయాలని అన్నారు.   ఈ సమావేశం లో నియోజకవర్గం  ప్రత్యేకాధికారి  సుబ్బా రావు, హౌసింగ్ పి.డి రమణ మూర్తి, మున్సిపల్ కమీషనర్ వర్మ, తహసీల్దార్  ప్రభాకర్, హౌసింగ్ డి ఈ లు పాల్గొన్నారు.