గుంటూరు జిల్లాలో జులై 1,3 మరియు 4 వ తేదీలలో నవరత్నాలు –పేదలందరికీ ఇళ్ళు ప్రత్యేక గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవంతమయ్యేలా అధికారులు సమన్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఎస్.ఆర్. శంకరన్ హాల్లో నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు నిర్మాణాల ప్రత్యేక గ్రౌండింగ్ మేళా కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జులై 1,3, మరియు .4 తేదిల్లో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించనున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో 61 వేల ఇళ్ళ గ్రౌండిగ్ కార్యక్రమం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాకు గతంలో నిర్ధేశించిన 10వేల ఇళ్ల శంఖుస్థాపన కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదే తరహాలో జగనన్న ఇళ్ళ నిర్మాణాల గ్రౌండిగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ లక్ష్యం మేరకు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు అధికారులు లబ్ధిదారులను చైతన్య పరిచి ఇళ్ళ నిర్మాణాలు జరిగే విధంగా చూడాలన్నారు. అందుకు అనుగుణంగా నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ రోజు నుంచే మండల నోడల్ అధికారులు గృహనిర్మాణ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు వాలంటీర్లు, విఆర్వొలు, పంచాయితీ అధికారులు, గ్రామ సచివాలయ కార్యదర్శుల సహకారం తీసుకొని ప్రణాళికా బద్ధంగా పనులు చేపట్టేలా కార్యకలాపాలను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గృహనిర్మాణ కార్యక్రమంలో ఇప్పటి వరకు పూర్తి అయిన పనుల పురోగతిని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావును అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో గృహనిర్మాణాలకు ఎదురవుతున్న అవాంతరాలను తెలుసుకొని వాటికి పలు పరిష్కార మార్గాలను జిల్లా కలెక్టర్ సూచించారు. గృహనిర్మాణాలకు సంబంధించి తొలి దశను పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అధికారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గృహనిర్మాణాలకు సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు నరసరావుపేట డివిజన్ లోని 15 వేల ఇళ్ళకు జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, గుంటూరు డివిజన్ లోని 20 వేల ఇళ్ళకు సంయుక్త కలెక్టర్(సచివాలయాలు- అభివృద్ధి) పి. ప్రశాంతి, గురజాల డివిజన్ లోని 6 వేల ఇళ్ళకు సంయుక్త కలెక్టర్(ఆసరా – సంక్షేమం) శ్రీధర్ రెడ్డి కి, తెనాలి డివిజన్ లోని 20 వేల ఇళ్ళకు సంయుక్త కలెక్టర్(గృహనిర్మాణం) అనుపమా అంజలికి పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పురోగతిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా ట్రైనీ కలెక్టర్ శుభం బన్సాల్ కు జిల్లా కలెక్టర్ బాధ్యతలను అప్పగించారు. జులై నెలలో మూడు రోజుల పాటు జరిగే గృహనిర్మాణాల స్పెషెల్ డ్రైవ్ గ్రౌండింగ్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. గృహాల గ్రౌండింగ్ పురోగతి పనులను రాష్ట్ర పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తతతో పని చేయాలని తెలిపారు. లబ్ధిదారులను జగనన్న కాలనీల దగ్గరకు తీసుకువచ్చేందుకు గ్రామ సర్పంచిలు, వార్డు వాలంటీర్లు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. అవసరమైన గృహనిర్మాణ సామాగ్రి మొత్తాన్ని లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చి పనులు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్లు ఎస్. దినేష్ కుమార్, పి. ప్రశాంతి, అనుపమ అంజలి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలందరికీ ఇళ్ళ కార్యక్రమం లక్ష్యాలను చేరుకునేందుకు కింది స్థాయి అధికారులను సమన్వయ పరుచుకొని గ్రౌండిగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్(సచివాలయాలు- అభివృద్ధి) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్(ఆసరా - సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్(గృహనిర్మాణం) అనుపమా అంజలి, జిల్లా ట్రైనీ కలెక్టర్ శుభం బన్సాల్, డి ఆర్ వొ కొండయ్య, గుంటూరు నగర కమీషనర్ చల్లా అనురాధ, నాలుగు డివిజన్ల ఆర్.డి,వొలు, మండల తహాశీల్దార్లు, ఎం.పి.డి.వొ లు, గృహ నిర్మాణ, విద్యుత్తు, ఏపి ఫైబర్ నెట్ శాఖల అధికారులు, ఆయా శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.