కోవిడ్ 19 బారిన పడకుండా ఉండేందుకు యూనిసెఫ్ సూచించిన సూత్రాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనిసెఫ్ లో రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలు వైవిధ్యాలుగా రూపాంతరం చెందుతున్న కరోనా వైరస్ ను సమర్ధ వంతంగా ఎదుర్కొనేందుకు యూనిసెప్ చిన్నారులు, పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా కలెక్టర్ అధికారులకు వివరించి గ్రామ స్థాయి నుంచే కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. గతంలో లాగా కోవిడ్ సోకితే హోం క్వారంటైన్ లో చికిత్స పొందకుండా కోవిడ్ కేర్ సెంటర్లు/ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్సలు పొందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా - రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్(సచివాలయాలు- అభివృద్ధి) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్(ఆసరా - సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్(గృహనిర్మాణం) అనుపమా అంజలి, జిల్లా ట్రైనీ కలెక్టర్ శుభం బన్సాల్, డి ఆర్ వొ కొండయ్య, గుంటూరు నగర కమీషనర్ చల్లా అనురాధ, నాలుగు డివిజన్ల ఆర్.డి,వొలు, మండల తహాశీల్దార్లు, ఎం.పి.డి.వొ లు, గృహ నిర్మాణ, విద్యుత్తు, ఏపి ఫైబర్ నెట్ శాఖల అధికారులు, ఆయా శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.