మటన్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచాలి..


Ens Balu
3
పాతురు
2021-06-26 12:31:17

అనంతపురం మటన్ మార్కెట్ లో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని పాతురు మటన్ మార్కెట్ లో శనివారం  నగర మేయర్  పర్యటించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ,  మార్కెట్ కు ప్రజలు  ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా  సూచించారు. మటన్ మార్కెట్ నందు తగిన వసతులు సరిగా లేవని ,మరమ్మతులు చేయించాలని అక్కడున్న వ్యాపారస్తులు మేయర్  దృష్టికి తీసుకు వచ్చారు. .దీనిపై స్పందించిన మేయర్  వెంటనే మరమ్మతులు చేయించి పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత  అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా మార్కెట్  బయట ఉన్న డంపర్ బిన్ రోజు క్లీన్ చేయించి పరిశుభ్రంగా ఉంచాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి,  హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ ,కార్పొరేటర్ లు రామాంజినమ్మ, బాబా ఫక్రుద్దీన్, అనిల్ కుమార్ రెడ్డి, కమల భూషణ్ కో ఆప్షన్ మెంబర్ షంషుద్దీన్, వైఎస్ఆర్ సీపీ నాయకులు సుబ్బయ్య, ఖాజా  తదితరులు పాల్గొన్నారు.