ఫస్ట్ ఎయిడ్ లేకపోవడం దారుణమే..


Ens Balu
1
Anantapur
2021-06-26 12:35:23

ఫస్ట్ ఎయిడ్ కు అవసరమైన వాటిని కూడా అందుబాటులో ఉంచుకోకుంటే ఎలా అంటూ అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందిని నగర మేయర్ మహమ్మద్ వసీం ప్రశ్నించారు. అనంతలోని  నాయక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను నగర మేయర్ శనివారం  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్  సెంటర్ కు వచ్చే ప్రజలకు ఏమి వసతులు లేవని స్థానికులు  మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం చేయడానికి అవసరమైన మందులు కాటన్ ఇతర మెడిసిన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది తీరుపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  స్థానికంగా వైద్యం అందుబాటులో ఉందని ఇక్కడికి బాధతో, రోగంతో వస్తే మందులు లేవు,ఫస్ట్ ఎయిడ్ లేదు అని వెనక్కు పంపిస్తే ఎలా అని సిబ్బందిని మేయర్ ప్రశ్నించారు. ముందస్తుగా అవసరమైన మెడిసిన్ ను తెప్పించుకోవాలని మందులు సరఫరా చేసే అపోలో వారు చేయకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో తెచ్చుకోవాలి కానీ తమ వద్ద లేవని రోగులకు వైద్య సేవలు అందించక పోవడం సరి కాదన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.  అవసరమైన మందులు ఇతరత్రా వాటిని  సప్లై చేసే అపోలో వాళ్ళతో మాట్లాడి వెంటనే వాటిని  ఏర్పాటు చేయాలని  డిప్యూటీ కమిషనర్ తో పాటు  హెల్త్ ఆఫీసర్ ని మేయర్ ఆదేశించారు. అంతేకాకుండా అర్బన్ హెల్త్ సెంటర్ లో  శానిటేషన్ గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేసి శుభ్రం చేయించాలని సూచించారు. ఆసుపత్రి గేటు వద్ద చాలా మంది ప్రజలు పడుతున్నారని వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగ వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని సిబ్బందికి మేయర్  సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు సాకే చంద్ర శేఖర్ ,అనిల్ కుమార్ రెడ్డి, కమల భూషణ్ వైఎస్ఆర్ సీపీ నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.