అప్పన్నను దర్శించుకున్న 30వేల మంది..


Ens Balu
3
Simhachalam
2021-06-26 15:37:09

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని శనివారం ఒక్కరోజే 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు. జేష్టమాసం కావడం, ఆపై ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో భక్తులు స్వామివారిని చూడటానికి పోటెత్తారు. గాలిగోపురం దగ్గర నుంచి కొండపై బస్టాండ్ వరకు భక్తులతో రద్దీగా మారిపోయింది. దీనితో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ ఈఓ ఎంవీసూర్యకళ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ అనంతరం ఒకేసారి ఇన్నివేల మంది భక్తులు రావడం ఇదే తొలిసారి.  శుక్రవారంనాటికే 50వేల లడ్డూలు, 16వేల పురిహోర ప్యాకెట్లు స్టాక్ పెట్టిడంతో.. భక్తుల ప్రసాదానికి ఎలాంటి సమస్యా రాలేదు. ఇక నుంచి పర్వదినాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈఓ దేవస్థాన అధికారులను ఆదేశించారు.