త్వరగా జిల్లా ఆసుపత్రి సిద్ధంచేయాలి..


Ens Balu
3
Tekkali
2021-06-27 14:47:53

టెక్కలి జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లాఠకర్ అధికానులను ఆదేశించారు. ఆదివారం  వంశధార కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న జిల్లా ఆస్పత్రి నూతన భవనాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎంత విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నది, పడకల సంఖ్య, తాగునీటి సౌకర్యం, నిధులు మంజూరు వంటి వివరాలను వైద్య విధాన పరిషత్ కార్యనిర్వాహక ఇంజనీర్ బి.ఎన్. ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అవసరాలకు వంశధార కాలువ పక్కన ఆర్డబ్ల్యూఎస్ ఏర్పాటు చేసిన తాగునీటి బో ర్ నుండి నీటి వినియోగం, నిల్వ చేసేందుకు లక్ష లీటర్ల సామర్థ్యం గల సంపు ఏర్పాటు విషయాలనువివరించారు. 164 ఆక్సిజన్ సిలిండర్ల కనెక్షన్ లతో పడకలు ఏర్పాటు చేయడమైనద ని ఈ ఈ కలెక్టర్ కు తెలిపారు. 1000 ఎల్.పి.ఎం సామర్ధ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్ రావలసి ఉందని, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు మరో 15 రోజుల్లోగా పూర్తి కానుందని తెలిపారు. ఆస్పత్రి పనులు ఎప్పటిలోగా పూర్తి కావొచ్చన్న కలెక్టర్ ప్రశ్నికు జూలై 20 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామని తెలిపారు. పోస్టుమార్టం గది నిర్మాణం కొరకు ప్రశ్నించగా ఇందుకు ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ దృష్టికి తేగా అప్పటివరకు పాత ఆసుపత్రి భవనం వద్ద సేవలు కొనసాగించాలని సూచించారు.

 త్వరితగతిన పనులు పూర్తి కి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత ఆసుపత్రి నూతన భవనం అందుబాటులోకి వచ్చినప్పటికీ పాత ఆస్పత్రి కూడా వినియోగించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కె. కేశవ రావుకు సూచించారు. అనంతరం కోవిడ్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో కోవిడ్ కేసులు నమోదు, ఆస్పత్రిలో ఎంతమంది చికిత్స పొందుతుంది,  కోవిడ్ నుండి కోలుకున్నవారి సంఖ్య డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ డా, లీలా ను అడిగి  తెలుసుకున్నారు. మూడవ దశ కరోనా వ్యాప్తి రానున్న దృష్ట్యా చిన్నపిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న నిపుణుల సూచన లు మేరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులను సూచించారు. కరోనా వంటి ప్రాణాంతక పరిస్థితుల్లో వైద్యులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. అనంతరం స్థానిక పట్టు మహాదేవ కోనేరు ను పరిశీలించారు. అభివృద్ధి ప్రణాళికను ఎమ్ ఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ కలెక్టర్ కు వివరించారు.   కలెక్టర్ మాట్లాడుతూ చెరువు కట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కు దోహదపడుతుందన్నారు. అక్కడి నుండి వంశధార కాలువ పక్కన ఆర్డబ్ల్యూఎస్ ఏర్పాటుచేసిన తాగునీటి బోర్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో  ఇన్ ఛార్జ్ ఆర్ డి ఓ సీతారామమూర్తి, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ఎస్ .సూర్య రావు,  మండల ప్రత్యేక అధికారి డా, మంచు కరుణాకర్ రావు, తాసిల్దార్ ఎస్. గణపతి, ఎంపీడీవో పి. నారాయణ మూర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ .నీలయ్య, సర్వేయర్ సుభాష్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.