తల్లుల వేక్సిన్ లో విజయనగరమే ఫస్ట్..
Ens Balu
2
Vizianagaram
2021-06-28 11:05:06
ఐదేళ్ల లోపు వయస్సు గల పిల్లల తల్లులకు కోవిడ్ వాక్సిన్ ఇవ్వడంలో రాష్ట్రంలోనే విజయనగరం అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. రాష్ట్రంలో సగటున 66శాతం తల్లుల వాక్సినేషన్ జరుగగా, మన జిల్లాలో 94శాతం మంది ఐదేళ్లలోపు వయస్సు గల బాలల తల్లులకు వ్యాక్సినేషన్ పూర్తిచేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో 88,517 మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుండగా 83,174 మందికి ఆదివారం నాటికే వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. ఈ మేరకు గరిష్ట స్థాయిలో వ్యాక్సినేషన్ సాధించడంలో కృషిచేసిన ఏ.ఎన్.ఎం.లు, ఆశ కార్యకర్తలు, వలంటీర్లకు జిల్లా కలెక్టర్ అభినందించారు.