స్పందనకు 87 వినతులు..


Ens Balu
5
Vizianagaram
2021-06-28 12:56:49

విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన టెలి స్పందనకు 12 ఫోన్ కాల్స్ అందాయి. కోవిడ్  దృష్ట్యా  ప్రజల  నుండి వినతులను స్వీకరించడానికి నిర్వహిస్తున్న స్పందనకు బదులుగా టెలి స్పందన నిర్వహించి టెలిఫోన్ ద్వారా వినతులను  స్వీకరించాలని కలెక్టర్ నిర్ణయించారు. అయినప్పటికి సోమవారం త్వరలో చేపట్టనున్న గృహ నిర్మాణాలకు సంబంధించి ఇళ్ల పట్టాల సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ ను కలసి తమ వినతులను అందజేసారు.  స్పందనలో డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు కూడా వినతులను అందుకున్నారు. స్పందనలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఇదే వేదిక ద్వారా జిల్లా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.