గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలలో పనిచేస్తున్న వలస కూలీలకు కోవిడ్ పరీక్షలు చేసి,
టీకాలు వేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు, రవాణ రంగాలలో కోవిడ్ వ్యాప్తిని అరిక ట్టడం పై సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. కోవిడ్ మూడవ దశ, బ్లాక్ ఫంగస్, డెల్టాప్లస్ వేరియంట్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ మూడవదశ ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు అప్రమత్తం కావాలన్నారు. ముఖ్యంగా గ్రానైట్ క్వారీలు,
పరిశ్ర మలు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగ ప్రాంతాలు, రవాణ రంగ ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇలా జిల్లాలో 1,953 ప్రాంతాలలో పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాలనుంచి వలస కార్మికులు అధికంగా వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాలలో ఒక వారంలో 26 వేలమందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారందరికి కరోనా నివారణ టీకా వేయించాలన్నారు. కోవి డ్ నిబంధనల పై అవగాహన కల్పిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్ర పరచుకోవడం, విధిగా పాటించేలా చూడాలన్నారు. పండ్లతోటల వద్ద కార్మికులకు కోవిడ్ పరీక్షలు చేసేలా ప్రత్యేక బ్రుందాలను నియమించాలని కలెక్టర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా జిల్లా సరిహద్దులున్న మండలాలోను కోవిడ్ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, వివిధ జిల్లాలక ు వెళ్తున్న లారీ, కారు డ్రైవర్లకు పరీక్షలు చేసి టీకా వేయాలన్నారు. కోవిడ్ వ్యాప్తి అరికట్టడంలో అధికారులతో పాటు వివిధ రంగాలలోని యూనియన్లు, సంఘాల ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 5.5 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, కేసుల నమోదు శూన్యం కావాలన్నారు. కరోనా వైరస్ జిల్లాలో తగ్గిపోయిందని భావన విడిచి పెట్టాలని, ప్రజలంతా జాగ్రత్తలు పాటించేలా ప్రచారం చేయాలన్నారు. కొత్త వైరస్ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్థి) టి.ఎస్. చేతన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ పి. రత్నావళి, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎమ్. చంద్రశేఖర రెడ్డి,
భూగర్భ గనుల శాఖ డి.డి. నర్సింహారెడ్డి, ఉప కార్మిక కమిషనర్ శ్రీనివాసరావు, కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జి డాక్టర్ తిరుమల రావు, గ్రానైట్ క్వారీల ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి, కార్యదరి ్శ శుభాస్కర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.