మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఉద్యోగులు హెచ్పీ పెట్రో స్మార్ట్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. సోమవారం జివిఎంసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 700 మంది జివిఎంసి ఫీల్డ్ ఉద్యోగులకు పెట్రోల్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గతంలో కూపన్లు పద్దతి ద్వారా ఫీల్డ్ ఉద్యోగులకు పెట్రోలు పంపిణీ చేసేవారని, దానివలన జాప్యం అవుతున్నందున వాటి స్థానంలో స్మార్ట్ కార్డులను ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ పద్దతి కోసం 17 పెట్రోల్ బంకులను ఎంపిక చేశారన్నారు. జివిఎంసి ఫీల్డ్ ఉద్యోగులు ఏ బంకులోనైననూ ఈ స్మార్ట్ కార్డుల ద్వారా పెట్రోల్ ను వినియోగించు కోవచ్చునని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు కోటేశ్వరరావు, ఫీల్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.