సింహాచలం దేవస్థానంలో జూలకటక.. అన్నవరం ఈఓకి అధనపు బాధ్యతలు


Ens Balu
2
Simhachalam
2020-09-01 20:30:25

సింహాచలం దేవస్థానంలో చకా చకా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఈఓగా పనిచేస్తున్న బ్రమరాంబ తనను సింహాచలం ఈఓగా తప్పించా లని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి కారణం చైర్ పర్శన్ ఈఓ మధ్య విభేదాలేనని తెలుస్తుంది. ఈ క్రమంలోనే  సింహాచలం ఇన్ఛార్జి ఈవోగా అన్నవరం ఈవో త్రినాధరావు ను నియమిస్తూ, ప్రభుత్వ స్పెషల్ కమిషనర్ పి.అర్జున రావు ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. దేవస్థానంలో చాలా మందిని సిబ్బందిని తప్పిం చడం, ఏకపక్షనిర్ణయాలు చేయడం, అంతముందు పనిచేసిన ఈఓ పలు నిర్మాణాలు, కట్టడాల్లో అవకతవకలకు పాల్పడం వంటి కార్యక్రమాలు జరిగాయి. తరువాత పాత ఈఓను తప్పించి బ్రమరాంబను ఈఓగా ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత కూడా దేవస్థానం చైర్మన్ కి, ఈఓకి మధ్య పచ్చగడ్డివేస్తే బగ్గుమనే విభేదాలు తలెత్తాయి. దీంతో అధికారుల ఆదేశాలతో ఈఓ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో, ఖచ్చితంగా అక్కడ ఈఓ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్నవరం ఈఓను ఇన్చార్జిగా నియమిస్తూ, ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. సింహాచలంలో చైర్ పర్శన్ నియామం దగ్గర నుంచి అనేక మార్పులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది...
సిఫార్సు