7లోగా కాపునేస్తం దరఖాస్తులివ్వండి..
Ens Balu
2
Srikakulam
2021-06-29 12:34:27
కాపు నేస్తం పథకానికి జూలై 7వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను జారీ చేస్తూ అర్హులైన ఓసి-కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులని వివరించారు. జూన్ 24వ తేదీ నాటికి 45-60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని ఆయన తెలిపారు. అర్హులైన వ్యక్తులు వాలంటీర్ ను సంప్రదించి సంబంధిత సచివాలయంలో జూలై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు. దరఖాస్తు చేస్తున్న అర్హులైన అభ్యర్ధులు విధిగా ఆధార్ ప్రామాణీకరణ (EKYC) చేసుకొని ఉండాలని ఆయన స్పష్టం చేసారు. YSR కాపు నేస్తం పథకం క్రింద అర్హులైన మహిళా లబ్దిదారులకు రూ.15 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2020-21 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ పథకం క్రింద మొదటి సంవత్సరం 2020-21 సం.లో శ్రీకాకుళం జిల్లాలో 5786 మంది లబ్దిదారులకు రూ.8.68 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. 2021-22 సం.నకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్న లబ్దిదారులకు జూలై 24వ తేదీన ముఖ్య మంత్రి చేతుల మీదుగా ఆర్ధిక సహాయం ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.