ఉద్యోగులు సమయ పాలన పాటించాలి..
Ens Balu
4
Vizianagaram
2021-06-29 12:56:58
ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా సమయ పాలన, క్రమశిక్షణ పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతీఒక్కరూ నిర్ణీత వేళకు కార్యాలయాలకు హాజరు కావాలని ఆదేశించారు. ఎవరైనా కార్యాలయం నుంచి బయటకు వెళ్లే పక్షంలో, ఉన్నతాధికారులనుంచి అనుమతి తీసుకోవాలని, విధుల్లో భాగంగా బయటకు వెళ్లేటప్పుడు, తప్పనిసరిగా మూవ్‌మెంట్ రిజిష్టర్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. ఉద్యోగుల సమయ పాలన పాటిస్తున్నదీ లేనిదీ, మండల స్థాయి అధికారులు తనిఖీ చేయాలని కోరారు. ప్రజలనుంచి వచ్చే ఆర్జీలను ఎప్పటికప్పుడు, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, చేయలేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.