దిశయాప్ ప్రతీ మహిళ సెక్యూరిటీ గార్డ్..
Ens Balu
1
Visakhapatnam
2021-06-29 13:22:10
మహిళలంతా దిశ యాప్ తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో అది సెక్యురిటీ గార్డ్ గా పనిచేస్తుందని ప్రముఖ న్యాయవాధి, సామాజిక వేత్త రహిమున్నీసాబేగం పేర్కొన్నారు. మంగళవారం విశాఖలో ఆమె దిశ యాప్ వినియోగంపై మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం చాలా మంచి రక్షణ వ్యవస్తను దిశ యాప్ ద్వారా రూపొందించిందన్నారు. దీనిని అత్యవసర సమయంలో వినియోగించడం ద్వారా పోలీసుల నుంచి సహాయ సహకారాలు అందుతాయన్నారు. ప్రతీ ఒక్క మహిళ సెల్ ఫోనులో దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దుండగల నుంచి రక్షించుకోవడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ యాప్ మహిళల ఫోన్లలో ఉంటే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేంత దైర్యం కూడా వస్తుందన్నారు. అనంతరం దిశ యాప్ యొక్క ప్రాముఖ్యత, దీనిని ఏ విధంగా వినియోగించాలో కూడా సహచర మహిళా లాయర్లకు వివరించినట్టు చెప్పారు. త్వరలో మహిళలకు, విద్యార్ధినిలకు చైతన్యం తీసుకు రావడం కోసం ప్రత్యేకంగా పాల్గొనే కార్యక్రమాల్లో దిశ యాప్ కోసం ప్రస్తావిస్తానని ఆమె వివరించారు. కాలేజీ వెళ్లే యువతులే కాకుండా ఇంట్లో ఉండే మహిళలు కూడా అత్యవసర సమయంలో దీనిని ఉపయోగించవచ్చునన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవాలని ఆమె సూచించారు. యాప్ ఇనిస్టాల్ చేసుకున్న ప్రతీ ఒక్కరూ మరో ముగ్గురు...వారంతా ఒక్కొక్కరూ ముగ్గురు ముగ్గురితో యాప్ ని స్వచ్ఛందంగా ఇనిస్టాల్ చేయించడానికి ముందుకి రావాలని రహిమున్నీసాబేగం కోరారు.