మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా సక్సెస్ కావాలి..
Ens Balu
2
Sattenapalle
2021-06-29 14:26:32
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవతం చేయడానికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం మద్యాహ్నం సత్తెనపల్లి పట్టణంలో 2, 3 వార్డు సచివాలయాలను జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పని చేస్తున్న వార్డు సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది విధులను పరిశీలించారు. వార్డు సచివాలయంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలను అడిగి తెలుసుకున్నారు. గృహనిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంతమందిని మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా ద్వారా సన్నద్ధం చేశారని ప్రశ్నించారు. 2, 3 వార్డుల పరిధిలో మొత్తం 174 మంది లబ్ధిదారులను ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించుకునేందుకు గుర్తించడం జరిగిందని సచివాలయ అడ్మిన్ సెక్రటరీ ఎం. విజయలక్ష్మీ, ఇంజనీరింగ్ సెక్రటరీ సుశ్మితలు తెలిపారు. వీరిలో బీమవరం గ్రామ శివారుల్లో రెండు చోట్ల లే అవుట్ల ను గుర్తించి అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాలు కేటాయించినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ కు వివరించారు. ఇప్పటి వరకు 30 మంది లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునేందుకు ముందుకు వచ్చారని అన్నారు.. మిగతా 144 మందికి స్థానిక కౌల్సిలర్ లు, మెప్మా నోడల్ అధికారిణి నాగేశ్వరీలతో కలిసి అబ్ధిదారులతో బుధవారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా, ఆ సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కార మార్గాలను చూపుతామన్నారు. అవసరమైతే ఆర్ధిక ఇబ్బందులు ఉన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు స్ర్తీశక్తి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు, తహాశీల్ధార్ రమణ కుమారి,గృహనిర్మాణశాఖ అధికారులు, వార్డు సచివాలయ సబ్బంది తదితరులు పాల్గొన్నారు.