విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ రాహలక్ష్మీనృసింహస్వామి వారి దర్శనాలు జూలై 1వ తేది నుంచి ఉదయం 6.30 నుంచి రాత్రి 7గంటల వరకూ అనుమతిస్తామని దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. బుధవారం ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా తగ్గుముఖం పట్టిన సందర్భంగా రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ పెంచిన సమయాన్ని అమలు చేస్తామని వివరించారు. కాగా ఉదయం 6:30 నుంచి 11:30 వరకు దర్శనాలు, ఆ తరువాత ఉదయం 11:30 నుంచి మధ్యహా్నం 12:15 రాజభోగం (భక్తులకు దర్శనాలుండవు) ఆ తరువాత 12:15 నుంచి 2:30 దర్శనాలు ఉంటాయి. మళ్లీ 2:30 నుంచి 3:00 స్వామివారి పవళింపు (దర్శనాలుండవు) చివరిగా మధ్యాహ్నం 3:00 నుంచి రాత్రి 7:00 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని ఈఓ వివరించారు. ఈ కొత్త సమయాలను భక్తులు గుర్తించి స్వామిని దర్శించుకోవాలని కోరారు.