శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ.33.38లక్షలు


Ens Balu
4
Sullurupeta
2020-09-01 21:46:49

నెల్లూరులోని సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీల లెక్కింపు మంగళవారం కూడా చేపట్టారు. అమ్మవారి ఆలయంలోని  5 హుండీలు తెరిచి అందులోని నగదును లెక్కించారు. వాటిలో మొత్తం  రూ"33,83,648/-లు, బంగారు 0-148 గ్రాములు, వెండి 0-186 గ్రాములు మరియు అన్నదానము రూ"8,350/-లు. నిన్న, ఈ రోజు కలిపి మొత్తం రూ"34,33,648/-లు ఆదాయం చేకూరినట్టు ఛైర్మన్ దువ్వూరు  బాలచంద్రారెడ్డి తెలియజేశారు. కరోనా వైరస్ కేసులు అధికంగా వున్నం దున ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం, మాస్కుల ధారణ చేసిన తరువాత ఈ పరకామణి చేపట్టినట్టు చైర్మన్ వివరించారు. హుండీలు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ యం. సుధీర్ బాబు సమక్షంలో, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో లెక్కించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గోగులు తిరుపాలు,  పి.సుధ, కామిరెడ్డి రేవతి, వైసిపి నాయకులు కళత్తూరు రామ మోహన్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు. 
సిఫార్సు