ఫించన్ల పంపిణీలో రెండో స్థానం


Ens Balu
2
Vizianagaram
2021-07-01 16:23:36

విజయనగరం జిల్లాలో వై ఎస్ ఆర్ ఫించన్ కానుక పథకంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, కళాకారులు తదితర వర్గాల వారికి ఫించను మొత్తాల పంపిణీ 92.38 శాతం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. జిల్లాలో 3,31,216 మందికి ఫించన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3,05,964 మందికి వాలంటీర్లు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఒక వైపు మెగా హౌసింగ్ మేళా లో సేవలందిస్తునే మరో వైపు ఫించన్లు పంపిణీ చేయడం ద్వారా వాలంటీర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించారని కలెక్టర్ వారిని అభినందించారు. ఫించన్ మొత్తాల పంపిణీ లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.