మాస్కు ధరించడంలో నిర్లక్ష్యం వద్దు..


Ens Balu
3
Vizianagaram
2021-07-02 13:46:46

కరోనా తగ్గుముఖము పడుతున్నప్పటికీ  మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ రావిరాల  మహేష్ కుమార్ స్పష్టం చేసారు. శుక్రవారం తన ఛాంబర్లో  ఆయన మాట్లాడుతూ మాస్క్ ధరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే  ఇటీవల యునిసెఫ్  రూపొందించిన నాలుగు రాకల  మాస్క్  పోస్టర్లను విడుదల చేశారు. వీటిని జిల్లా కేంద్రంలోని కొన్ని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలకు పంపిణీ  చేసారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ జిల్లాలో కరోనా  తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.  లాక్డౌన్ సమయంలో ప్రజలు ఏ విధంగా ప్రవర్తించారో  ఆ తరువాత కూడా అదే  పద్దతులను పాటించాలన్నారు. కోవిడ్ అనుమానితులు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే గుంపు ప్రదేశాలలో ఉండరాదని తెలిపారు. సామాజిక దూరం తప్పనిసరి అన్నారు. మాస్క్ ధరించడంలో కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ముక్కు మీద వరకు మాస్క్ ఉండాలన్నారు. ఎన్ 95 మాస్క్ అయితే ఒకటి చాలన్నారు. సర్జికల్ మాస్క్ ధరించేవారు బయట కాటన్ మాస్క్ ధరించవచ్చని స్పష్టం చేశారు. కండరాలు, శక్తి సామర్ధ్యాలను పెంచే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలన్నారు. జిల్లాలో తాజాగా 21 మండలాల్లో 95 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.  అత్యధికంగా పార్వతీపురం డివిజన్లో  డెంగబద్ర తోపాటు, విజయనగరం , గజపతినగరం,ఎస్ కోట, బాడంగి తదితర మండలాలలో కరోనా  కేసులు అధికంగా ఉన్నాయన్నారు. కరోనా నిరోధానికి సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు  తెలిపారు.