దివంగత వైఎస్సార్ నిరుపేదల గుండె చప్పుడు...


Ens Balu
3
Visakhapatnam
2020-09-02 11:06:56

దివంగ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరెడ్డి తెలుగు ప్రజల గుండె చప్పుడు అని రాజ్య సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి కొనియాడారు. ఆయన 11వ వర్దంతి సందర్భంగా విశాకలోని పార్కు హోటల్ వద్ద వున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ నిరుపేదల పక్షపాతి అని, అందుకే సంక్షేమ పధకాలన్నీ వారికోసమే ప్రవేశపెట్టారని అన్నారు. నేడు అదే బాటలో ఆయన తన యుడు, యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజారంజక పాలన చేపడుతున్నారని కొనియారు. వైఎస్సార్ స్పూర్తితో తామంతా ప్రజాసేవ చేస్తున్నామని చెప్పా రు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ , ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, నగర పార్టీ అధ్యక్షులు సిహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ తో కలిసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటి విభాగం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి,  వైసీపీ శ్రేణులు , కార్యకర్తలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సిఫార్సు