విశాఖ ఏజెన్సీలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి


Ens Balu
3
Sileru
2020-09-02 11:35:02

విశాఖ ఏజెన్సీ లో వింత వ్యాధులతో గిరిజనులు మృత్యువాత పడుతున్నారు.  గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ తొక పరాయి గ్రామానికి చెందిన గిరిజన రైతు కుటుంబంలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయం చేసుకొని బతుకు తున్న ఉదయ్ కుమార్ కు, భార్య సుశీల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో తొలిత మూడు నెలలు పసికందు మృతి చెందింది. అనంతరం మరో రోజు వ్యవధిలో మరో చిన్నారి మృతి చెందింది. ఇది జరిగిన నాలుగు రోజులకి తల్లి సుశీల బుధవారం ఉదయం గ్రామంలో మృతి చెందడంతో గ్రామంలో భయాం దోళనలు నెలకొన్నాయి. ఒకే గ్రామంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామస్తులు ఆందోలన చెందుతున్నారు. వీరు ముగ్గురూ  ఎందువల్ల చనిపోయారో అర్థం కాక ఏం చేయాలో అంతు చిక్కని పరిస్థితి తొకపరాయి గ్రామంలో నెలకొంది. ఈ మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.